గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ తో అక్రమ సంబంధంపై ఎలాన్ మస్క్ స్పందన

గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ తో అక్రమ సంబంధంపై ఎలాన్ మస్క్

Update: 2022-07-25 06:59 GMT

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ కు.. గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య మధ్య ఎఫైర్ ఉందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించారు. ఈ క్రమంలోనే ఎలన్ మస్క్‌ కంపెనీలలో తన పెట్టుబడులను విక్రయించాలంటూ తన అడ్వైజర్లకు సూచించారంటూ పేర్కొంది. గూగుల్ కో ఫౌండర్, బిలియనీర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షనన్ కు ఎలాన్ మస్క్ కు మధ్య అక్రమ సంబంధం ఉందని ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' కూడా కథనాన్ని ప్రచురించింది. చాలా ఏళ్లుగా మస్క్, సెర్గీ బ్రిన్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తన కథనంలో చెప్పుకొచ్చింది. అయితే తన భార్యతో మస్క్ కు అఫైర్ ఉందనే విషయం తెలిసినప్పటి నుంచి వారి మధ్య సంబంధం బలహీనపడుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేశారు. 2021 డిసెంబర్ 15 నుంచి తాను, షనన్ విడిగా ఉంటున్నట్టు ఆయన తెలిపారు. తన కూతురుని జాయింట్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ పార్టీలో బ్రిన్ కు మస్క్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.

టెస్లా వాహనాల ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత కొన్ని వాహనాలను మస్క్ కొందరికి ఇచ్చారు. వారిలో బ్రిన్ కూడా ఉన్నారు. అంతేకాదు 2008లో టెస్లా కంపెనీ కొంత ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు 5 లక్షల డాలర్లను మస్క్ కు బ్రిన్ సాయం చేశాడు. ఈ స్నేహం అక్రమ సంబంధం కారణంగా చెడిపోయింది. తన గర్ల్ ఫ్రెండ్, సింగర్ గ్రిమ్స్ తో మస్క్ విడిపోయిన కొన్ని నెలల తర్వాత మస్క్, షనన్ ల అఫైర్ వెలుగులోకి వచ్చింది. గ్రిమ్స్ తో మస్క్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ ఆరోపణలను ఎలాన్ మస్క్ ఖండించారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. నికోల్ తో తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను, సెర్గీ బ్రిన్ ఇప్పటికీ చాలా మంచి స్నేహితులమని అన్నారు. తన గురించి జరుగుతున్న ప్రచారం ఒక వదంతి మాత్రమేనని చెప్పారు. సెర్గీ బ్రిన్, తాను ఇప్పటికీ మంచి మిత్రులమని, నిన్న రాత్రి కూడా ఇద్దరం ఒక పార్టీలో ఉన్నామని మస్క్ చెప్పారు. సెర్గీ భార్య నికోల్ ను గత మూడేళ్లలో కేవలం రెండు సార్లు మాత్రమే చూశానని, ఆ సమయంలో కూడా తమ చుట్టూ ఎంతో మంది ఉన్నారని తెలిపారు.


Tags:    

Similar News