ట్విటర్ దివాళా అంటూ ఊహించని వ్యాఖ్యలు చేసిన మస్క్

Update: 2022-11-11 06:54 GMT

ట్విటర్ సీఈవోగా ఎలాన్‌ మస్క్‌ బాధ్యతలు చేపట్టాక.. ఆ సంస్థలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అది కూడా ఎంతో వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. కొందరేమో ఇదంతా ట్విట్టర్ ను మరింత మెరుగుపరచడానికే చేస్తున్న పనులు అని చెప్పగా.. ఇంకొందరేమో అనాలోచిత నిర్ణయాలు అంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. తాజాగా ఉద్యోగులతో మాట్లాడే సమయంలో ట్విటర్ సంస్థ దివాళా తీసే అవకాశం ఉందనే అంశాన్ని ఎలాన్‌ మస్క్‌ చెప్పారట..! మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల కొనుగోలు చేసిన రెండు వారాల తర్వాత ట్విటర్‌లో ఆర్ధిక అనిశ‍్చితి నెలకొందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మస్క్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. ట్విటర్‌ సీనియర్‌ ఉద్యోగులు ఒక్కొక్కరిగా వైదొలుగుతున్నారు. ట్విటర్‌ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మరియాన్ ఫోగార్టీలు రాజీనామా చేయడంతో ట్విటర్ యాజమాన్యం ఆందోళనకు గురైందని.. ఉద్యోగుల రాజీనామాలతో ట్విటర్‌ దివాలా తీయడం ఖాయమంటూ మస్క్‌ ఉద్యోగులతో హెచ్చరించారు. ఇటీవల కాలంలో ట్విటర్‌లో జరుగుతున్న వరుస పరిణామాలపై అమెరికా ప్రభుత్వ ఫెడరల్‌ ట్రేడ్‌ ఏజెన్సీ కమిషన్‌ (ఎఫ్‌టీసీ) స్పందించింది. ప్రభుత్వ న్యాయ చట్టాలను ధిక్కరిస్తూ కార్యకలాపాలు నిర్వహించే సంస్థల విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ఎఫ్‌టీసీ చెబుతోంది. సీఈవోలు లేదా సంస్థలు చట్టానికి అతీతం కాదు. ఎఫ్‌టీసీ నిబంధనలు లోబడి పనిచేయాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News