పాపం మస్క్.. కానీ లక్కీనే..!
ప్రముఖ వ్యాపార వేత్త, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు ఊహించని షాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని
ప్రముఖ వ్యాపార వేత్త, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు ఊహించని షాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటన కారణంగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్‌డాక్-100లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకుంది. దీంతో ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 20.3 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. అంటే మన కరెన్సీలో రూ.1.64 లక్షల కోట్ల పైమాటే ఆస్తులు ఆవిరైపోయాయి. ప్రస్తుతం ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 234.4 బిలియన్ డాలర్లు ఉంది. నాస్‌డాక్-100లో షేర్ల పతనం కారణంగా చాలా మంది వ్యక్తిగత సంపద కోల్పోయారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన ల్యారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ కో-ఫౌండర్లు ల్యారీ పేజ్, స్టెర్జెయ్ కలిపి 20.8 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయారు. గురువారం నాస్‌డాక్-100లో ఐటీ ఇండెక్స్ 2.3 శాతం పతనమైంది.