అమెరికాలో ఎమెర్జెన్సీ.. 31 మంది మృతి
అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎమెర్జెన్సీని ప్రకటించారు. మంచుతుపాను కారణంగా ఇప్పటికే 31 మంది మరణించినట్లు తెలిపారు
అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎమెర్జెన్సీని ప్రకటించారు. మంచుతుపాను కారణంగా ఇప్పటికే 31 మంది మరణించినట్లు తెలిపారు. అధికార వర్గాలు అందించిన వివరాల ప్రకారం అమెరికాలోని పలు ప్రాంతాలు మంచుతుఫానుతో అల్లాడుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో తీవ్ర సంక్షోభ పరిస్థితి నెలకొంది. మంచును తొలగించేందుకు కూడా సిబ్బందికి ఇబ్బందిగా మారింది.
విమానాలు రద్దు...
క్రిస్మస్ వేడుకలకు కూడా మంచు కారణంగా వేలాది మంది ప్రజలు దూరమయ్యారు. ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రయాణాలను అనేక మంది రద్దు చేసుకున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోనే దాదాపు 12 మంది మంచు కారణంగా మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని మొత్తం 9 రాష్ట్రాల్లో ఈ మంచు ప్రభావం ఉందని అధికారులు వెల్లడించారు. విమానాలను రద్దు చేశారు. అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే వేచి చూస్తున్నారు.