జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. ఒక సభలో ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి చేశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. ఒక సభలో ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి చేశారు. దీంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్పులు గల కారణాలు...
కాల్పులు జరపడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. షింజో అబే కు అధిక రక్తస్రావం అయినట్లు వైద్యలుు చెబుతున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరగడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.