ఇమ్రాన్ పై అవిశ్వాసం.. కాసేపట్లో

నేడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ భవితవ్యం తేలిపోనుంది. విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పై నేడు ఓటింగ్ జరగనుంది.

Update: 2022-04-09 05:56 GMT

నేడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలిపోనుంది. ప్రభుత్వం పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం పై నేడు ఓటింగ్ జరగనుంది. స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించగా, న్యాయస్థానం ఓటింగ్ జరగాలని తీర్పు చెప్పింది. దీంతో మరికాసేపట్లో పాక్ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరగనుంది. విపక్షాలు అన్నీ ఏకం కావడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ అవిశ్వాసం నుంచి గట్టెక్కడం కష్టమే.

మెజారిటీ లేక....
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 స్థానాలుండగా, అవిశ్వాసం నుంచి గట్టెక్కాలంటే 172 ఓట్లు అవసరం. అయితే ఇమ్రాన్ ఖాన్ కు మిత్రపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలు కూడా దూరమయ్యారు. దీంతో ఏ రకంగా చూసినా ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాసం నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఇ్రమాన్ ఖాన్ స్థానంలో పాకిస్థాన్ కు కొత్త ప్రధానిని ఎన్నుకునే అవకాశముంది. ఈ సమావేశాలకు ఇమ్రాన్ ఖాన్ గైర్హాజరయ్యారు.


Tags:    

Similar News