ఇంకా నాలుగు రోజులే.. తేలనున్న ఇమ్రాన్ భవితవ్యం

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం ఈ నెల 25వ తేదీన తేలనుంది. ఆరోజు జాతీయ అసెంబ్లీ సమాశం కానుంది

Update: 2022-03-21 02:04 GMT

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం ఈ నెల 25వ తేదీన తేలనుంది. ఆరోజు జాతీయ అసెంబ్లీ సమాశం కానుంది. ఈ మేరకు స్పీకర్ తేదీని ఖరారు చేశారు. అంటే ఇమ్రాన్ భవితవ్యం తేలడానికి ఇంకా నాలుగురోజుల సమయమే ఉందన్నమాట. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విపక్షాలన్నీ కలసి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 25వ తేదీన ఓటింగ్ జరగనుందని స్పీకర్ ప్రకటించారు.

వారికి వార్నింగ్.....
ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పార్టీ నుంచి 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ వారికి వార్నింగ్ ఇచ్చారు. తిరిగి పార్టీలోకి వచ్చి రాజీనామాలను ఉపసంహరించుకుంటే ఏం చర్యలు తీసుకోనని, అలా కాకపోతే కఠిన చర్యలు తప్పవని ఇమ్రాన్ హెచ్చరించారు. అయితే ఇమ్రాన్ వార్నింగ్ పెద్దగా పనిచేయలేదనే చెప్పాలి. మరోవైపు పాక్ ఆర్మీ కూడా ఇమ్రాన్ ను దిగిపోవాలని సూచించడంతో ఆయన ప్రధానిగా రాజీనామా చేయడం అనివార్యంగా కన్పిస్తుంది.


Tags:    

Similar News