చైనాలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలిపోతున్న టెలికాం బిల్డింగ్
బిల్డింగ్ లో ఉన్న డజన్ల ఫోర్లు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ఘటనపై అక్కడి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు.
చైనా దేశంలోని ఛాంగ్షా నగరంలో ఉన్న బిల్డింగ్ లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ లో ఉన్న డజన్ల ఫోర్లు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ ఘటనపై అక్కడి అధికారుల నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు. అగ్నిప్రమాదం గురించిన వీడియోలను స్థానికులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హునాన్ ప్రావిన్సు రాజధాని అయిన ఛాంగ్షా నగరంలో ఉన్న టెలికాం బిల్డింగ్ లో మంటలు చెలరేగి.. అవి భవనం మొత్తం వ్యాపించాయి.
పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. కాగా.. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ఎంతమంది గాయపడ్డారు ? ఎంతమంది చనిపోయారు ? ప్రమాదానికి గల కారణాలు వంటి వివరాలేమీ తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఛాంగ్సూ నగరంలో సుమారు 10 మిలియన్ల జనాభా ఉన్నారు.