అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. అమెరికాలోని ఇలినాయీ రాష్ట్రంలోని షికాగో నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. వేడుకలు ప్రారంభమయిన పది నిమిషాల్లోనే కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.
వేడుకలు జరుగుతుండగా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు గుమిగాడారు. ఒక్కసారి కాల్పులు జరపడంతో ఎటు వెళ్లాలో తెలియని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఒక భవనం పై నుంచి దుండగుడు కాల్పులు జరిపినట్లు గుర్తించారు. పోలీసులు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.