రాజకీయ వేదిక కూలి ఐదుగురు మృతి.. యాభై మందికి గాయాలు
మెక్సికోలో వేదిక కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. యాభై మందికి పైగా గాయాలయ్యాయి
మెక్సికోలో వేదిక కూలిపోయిన ఘటనలో ఐదుగురు మరణించారు. యాభై మందికి పైగా గాయాలయ్యాయి. మెక్సికో లో జూన్ రెండో తేదీన ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే మెక్సికోలోని న్యూవో లియోయన్ రాష్ట్రంలోని శాన్ షెడ్రో గార్సియాలో జరిగిన ఒక ఎన్నికల ప్రచారంలో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది.
ఈదురుగాలులు...
ఈ వేదిక కూలిపోవాడానికి ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు కారణమని చెబుతున్నారు. దీంతో వేదిక కూలి దాని కింద పడి ఐదుగురు మరణించారని అధికారింగా ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. బలమైన గాలుల కారణంగానే వేదిక కూలిందన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరించి చికిత్స అందిస్తున్నారు. మెక్సికోలో తుపాను కారణంగా ఎవరూ ఇళ్లు వదలి బయటకు రావద్దని కూడా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.