కాలిఫోర్నియాలో వరదల బీభత్సం
అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో నదులన్నీ పొంగుతున్నాయి.
అమెరికాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలతో నదులన్నీ పొంగుతున్నాయి. మరో 24 గంటల్లో పరిస్థితి మరింత దారుణంగా మారబోతుందని అమెరికా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పహారో నదిపై ఉన్న లవీ వంతెన తెగిపోయింది. శాన్‌ఫ్రాన్సిస్క్‌బే ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలతో...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వరదనీరు అనేక ప్రాంతాల్లో ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాలిఫోర్నియాలో ఉరుములు, మెరుపులతో కూడిన గాలుల, వానలు పడుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. ఒక్క శాంతాక్రజ్ కౌంటీ లోనే దాదాపు పది వేల మంది నిరాశ్రయులయ్యారు. సహాయక బృందాలను రంగంలోకి దించి ప్రాణనష్టం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
.