America : భారీ వరదలతోజనజీవనం అస్తవ్యస్థం.. బీభత్సంతగా మారిన రాష్ట్రాలివే

అమెరికాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది

Update: 2024-06-26 04:20 GMT

అమెరికాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలుతో అస్తవ్యస్థంగా మారింది. అనేక మంది సురక్షిత ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. నదులు ఉప్పొంగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, వరదల ప్రభావం రవాణా వ్యవస్థపైన కూడా పడింది. దాదాపు ముప్పయి లక్షల మంది ప్రజలు అమెరికాలో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. డ్యామ్ లు కూడా తెగి ఊళ్ల మీద పడుతుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.

నదులు ఉప్పొంగి...
భారీ వర్షాలకు, వరదల తీవ్రతకు ఒక రైలు వంతెన కూలిపోయింది. డ్యామ్ బద్దలు కావడంతో నీరు పట్టణాలపై పడింది. అమెరికాలో వరదల కారణంగా మిన్నెసోటా, సౌత్ డకోటా, అయోవా, నెబ్రస్కా రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది. ఈ ప్రాంతాల్లో నలభై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం చూస్తే ఏ స్థాయిలో వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. మిసౌరి, మిసిసిపీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెబుతున్నారు. బ్లూ ఎర్త్ కౌంటీలో వరదల దెబ్బకు ర్యాపిడన్ డ్యామ్ బద్దలు కావడంతో లోతట్టు ప్రాంతాలను సురిక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు కొట్టుకుపోయాయి. వాహనాలు కనిపించడం లేదు. ఇంట్లో వస్తువులన్నీ ఇక పనికి రావని నిరాశ్రయులైన వారు ఆవేదన చెందుతున్నారు.
అధికార యంత్రాంగం...
మరికొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అమెరికాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్తినష్టం అంచనా ఎంతన్నది తెలియకపోయినా భారీగానే ఉండే అవకాశాలున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పటి వరకూ వరదల కారణంగా ఇద్దరు మరణించారు. పూర్తిగా వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే ఆస్తినష్టం ఎంతనేది తెలియనుంది.


Tags:    

Similar News