నేడు ఓటింగ్... తేలనున్న భవితవ్యం

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ నేడు తేలనుంది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు ఓటింగ్ జరగనుంది.

Update: 2022-04-03 02:11 GMT

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్ నేడు తేలనుంది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ఆయన గద్దె దిగడం ఖాయమని గత కొద్ది రోజులుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. అవిశ్వాసానికి ముందుగానే ఇమ్రాన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం రాజీనామా చేసేందుకు సిద్ధపడలేదు.

ఏ ప్రధాని....
పైగా తన పార్టీ సభ్యులను ఓటింగ్ కు గైర్హాజరు కావాలని అందించారు. పాక్ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పూర్తికాలం ప్రధాని పదవిలో ఉండలేదు. ఇందుకు ఇమ్రాన్ ఖాన్ మినహాయింపు కాదు. 2018 ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. పాక్ లో ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థిితి దిగజారడానికి కారణం ఇమ్రాన్ ఖాన్ నిర్ణయాలేనంటూ విపక్షాలన్నీ కలసి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. నేడు దానిపై ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ భవిష‌్యత్ నేడు తేలిపోనుంది.


Tags:    

Similar News