జీ 20 సమావేశాలకు రష్యా, జిన్ పింగ్ గైర్హాజరు

వచ్చే నెల 9-10ల్లో జరిగే జీ 20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ గైర్హాజరు కానున్నారు. ఆయనకు బదులుగా లీ కియాంగ్ హాజరు కానున్నట్లు మీడియా తెలిపింది.

Update: 2023-08-31 08:02 GMT

జీ 20 సమావేశాలకు రష్యా, జిన్ పింగ్ గైర్హాజరు

వచ్చే నెల 9-10ల్లో జరిగే జీ 20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ గైర్హాజరు కానున్నారు. ఆయనకు బదులుగా లీ కియాంగ్ హాజరు కానున్నట్లు మీడియా తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాలు తమవిగా చైన తన పటంలో చూపించడం పై భారత్ తీవ్రంగా ఖండించింది. అందువల్లనే ఆయన హాజరు కాబోవడం లేదని తెలుస్తోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇప్పటికే తాము జీ20 సమావేశాలకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ భేటీకి హాజరు కావట్లేదు. రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ భారత్‌కు వస్తారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో రష్యా దురాక్రమణపై అన్ని దేశాలు ప్రశ్నిస్తాయని చెప్పడం కూడా రష్యా అధ్యక్షుడి గైర్హాజరును సూచిస్తోంది.

భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు జీ20లో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

ఈ ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సులో పాల్గొనడానికి జో బైడెన్ భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు ఇదివరకే వైట్ హౌస్ వెల్లడించింది. 7న ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయన వెంట అమెరికా విదేశాంగ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు.

Tags:    

Similar News