America : అమెరికాలో వారంరోజులు నుంచి భారీ వర్షాలు.. వరదలతో అల్లాడుతున్న జనం
అమెరికాలో భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. వరదలతో అనేక ఇళ్లు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు
అమెరికాలో భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. వరదలతో అనేక ఇళ్లు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సొంత ఇళ్లను వదిలిపెట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుటున్నారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వరదలు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సామన్య జనజీవనం స్థంభించిపోయింది. రాక్ నది పొంగి పొరలుతుంది. ప్రజలు మంచినీటి కోసం కూడా అవస్థలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల సాయంతో బయటకు తీసుకువచ్చేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇరవై ఒక్క కౌంటీలలో హై అలెర్ట్ ప్రకటించారు. సియూక్స్ కౌంటీ మొత్తం నీట మునిగిపోయింది. సౌత్ డకౌటా రాష్ట్రంలోనూ ఎమెర్జెన్సీని అధికారులు ప్రకటించారు. అయోవా రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉంది.