దుబాయ్ లో భారీ వర్షం.. ఎక్కడి వాహనాలు అక్కడే

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడారి దేశంలో భారీ వరదలకు జనజీవనం స్థంభించిపోయింది.

Update: 2024-04-17 03:37 GMT

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడారి దేశంలో భారీ వరదలకు జనజీవనం స్థంభించిపోయింది. దుబాయ్ లో అయితే రహదారులపై వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపేశారు.

ఈదురుగాలులు కూడా...
దీంతో పాటు దుబాయ్ లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దుబాయ్ లో రహదారులపై నిలిచిన నీటిని తీడేందుకు పెద్ద పెద్ద ట్యాంకర్లను ఉపయోగిస్తున్ేనారు. ఒమన్ లో కురిసిన భారీ వర్షాలకు ఇప్పటి వరకూ పద్దెనిమిది మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కొందరి ఆచూకీ కోసం గాలిపు చర్యలు చేపట్టారు. బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లోనూ వానలు దంచి కొడుతున్నాయి.


Tags:    

Similar News