జపాన్ కు సునామీ హెచ్చరిక అలెర్ట్‌గా ఉండాల్సిందే
జపాన్ లో భారీ భూకంపం ప్రజలను భయపెట్టింది. ఈరోజు క్యుసు ద్వీపం సమీపంలో ఈ భూకంపం సంభవించింది.
జపాన్ లో భారీ భూకంపం ప్రజలను భయపెట్టింది. ఈరోజు క్యుసు ద్వీపం సమీపంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1 తీవ్రతగా నమోదయిందని అధికారులు తెలిపారు. 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదయిందని తెలిపారు. భూకంప తీవ్రతకు ప్రజలు భయపడిపోయారు.
భూకంప తీవ్రతకు...
సమీపంలోని ఎయిర్‌పోర్టులో అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే భూకంప తీవ్రత కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. జపాన్ లోని క్యుషు, షికోకు ప్రాంతంలో ప్రజలకు సురక్షితంగానే ఉన్నారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలతో ఈ రాత్రి గడిచేదెలా అంటూ బిక్కుబిక్కుమంటూ జపాన్ ప్రజలు గడుపుతున్నారు.