China : చైనాలో వణికించిన భూకంపం... 110 మందికిపైగానే మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంపం ధాటికి 110 మంది మరణించారు.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతగా నమోదయింది. ఈ భూకంపం ధాటికి 110 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. చైనాలోని వాయువ్య గన్స్, కింగ్ హై ప్రావిన్స్ లో ఈ భూకంపం సంభవించింది. రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి.
రెండువందల మంది...
ఈ భూకంపం కారణంగా దాదాపు రెండు వందలకు మందికి పైగానే గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం అర్థరాత్రి దాటాక ఈ భూకంపం సంభవించడంతో ప్రజలు బయటకు వచ్చే సరికి ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు
భవనాలు నేలమట్టం...
భూకంపం ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. శిధిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అర్థం కావడం లేదు. సహాయక కార్యక్రమాలు కొనసాగుుతన్నాయి. భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయభ్రాంతులతో బయటకు పరుగులు తీశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరణాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.