బ్రిటన్ ను ఊపేస్తున్న ఒమిక్రాన్.. 12 మంది మృతి
యూకేలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ తో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటం కలవర పరుస్తుంది.
ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాలు తీయడం లేదన్న ఒకే ఒక్క ఆనందం ఉండేది. కానీ యూకేలో మాత్రం ఒమిక్రాన్ వేరియంట్ తో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటం కలవర పరుస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటిలో వ్యాప్తి చెందింది. కానీ యూకేలో మాత్రం ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే యూకేలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 37 వేలు దాటి పోయాయి.
102 మంది చేరగా...
బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ సోకి 12 మంది ఈరోజు మరణించారు. మొత్తం 104 మంది ఒమిక్రాన్ తో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరగా 12 మంది మరణించారు. ఈ విషయాన్ని బ్రిటన్ ఉప ప్రధాని అధికారికంగా ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.