వీలైనంత త్వరగా అక్కడి నుండి వచ్చేయండి

Update: 2022-10-20 04:03 GMT

ఉక్రెయిన్ లో ఉన్న భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఉక్రెయిన్ ను ఖాళీ చేసి వచ్చేయాలని హెచ్చరించింది. యుద్ధం తీవ్రతరమవుతోందని, ఏ క్షణంలోనైనా ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది. అక్కడ ఉండటం ఏ మాత్రం సురక్షితం కాదని హెచ్చరించింది. ఉక్రెయిన్ కు వెళ్లాలనుకునేవారు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచిస్తూ ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్షల్ లా విధించారు. ఈ ప్రాంతాలన్నీ రష్యా సార్వభౌమాధికారం కిందకు వచ్చినట్టే.. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింత దిగజారాయి.

In view of the deteriorating security situation & recent escalation of hostilities across Ukraine, Indian nationals are advised against travelling to Ukraine. Indian citizens, including students, in Ukraine advised to leave Ukraine at earliest: Embassy of India in Ukraine అంటూ ట్విట్టర్ లో ఓ పోస్టును పెట్టింది. రష్యా పార్లమెంటు ఎగువ సభ డోనెట్స్క్, ఖెర్సన్, లుహాన్స్క్, జపోరిజ్జియా ప్రాంతాలలో మార్షల్ లా విధించాలనే పుతిన్ నిర్ణయానికి త్వరగా ఆమోదముద్ర వేసింది. ప్రయాణాలు, బహిరంగ సభలపై పరిమితులు, కఠినమైన సెన్సార్‌షిప్ వంటి అధికారం కలిగి ఉంటుంది.


Tags:    

Similar News