ఇతడిని కెనడాలో ఎందుకు అరెస్టు చేశారో తెలుసా?
కెనడాలోని న్యూ బ్రున్స్‌విక్ ప్రావిన్స్‌లో మోంక్టన్ నగరంలోని వాటర్ పార్క్ వద్ద ఓ భారత జాతీయుడిని
కెనడాలోని న్యూ బ్రున్స్‌విక్ ప్రావిన్స్‌లో మోంక్టన్ నగరంలోని వాటర్ పార్క్ వద్ద ఓ భారత జాతీయుడిని అరెస్టు చేశారు.25 ఏళ్ల వ్యక్తి నోవా స్కోటియాలోని హాలిఫాక్స్‌లో నివసిస్తున్నాడు. జూలై 7న మోంక్టన్‌లోని పబ్లిక్ వాటర్ పార్క్‌లో లైంగిక వేధింపుల నివేదికపై రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వాటర్ పార్క్ చుట్టూ తిరుగుతూ పలువురు మహిళలను ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడు. పన్నెండు మంది ఆ వ్యక్తి అసభ్యంగా తాకాడంటూ చెప్పుకొచ్చారు. వారిలో కొందరు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కాగా.. పోలీసులు యాక్షన్ లోకి దిగారు.
పోలీసులు ఆ వ్యక్తిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతను తరువాత కస్టడీ నుండి విడుదలయ్యాడు. అక్టోబర్ 24న మోంక్టన్ ప్రావిన్షియల్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. అతడి కారణంగా లైంగిక దుష్ప్రవర్తనకు గురైనట్లయితే తమని సంప్రదించాలని పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడి గుర్తింపును పోలీసులు వెల్లడించనప్పటికీ, వాటర్ పార్క్ వద్ద అతన్ని అరెస్టు చేసిన చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలికలలో ఒకరి తల్లి అతని చిత్రాలను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేసింది.