అమెరికాకు వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ కు షాకిస్తున్న అధికారులు

అమెరికాకు వెళ్లాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అన్ని సర్టిఫికెట్లు, డబ్బులు

Update: 2023-08-18 02:02 GMT

అమెరికాకు వెళ్లాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అన్ని సర్టిఫికెట్లు, డబ్బులు, కాలేజీలలో అడ్మిషన్స్ తో సమాయత్తమై అక్కడికి వెళ్ళాక.. ఇమ్మిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని వెనక్కు పంపితే..? ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు చాలా మందికి అలాంటి అనుభవమే ఎదురైంది. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినా.. విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు తీసుకున్నాక కూడా ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వెంటనే వెనక్కి పంపారు. అమెరికాలోని అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులను సరైన పత్రాలు లేకపోవడంతో వెనక్కి పంపారు.

మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. అన్ని ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉన్నా తమను ఎందుకు తిప్పిపంపారో అంటూ విద్యార్ధులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భార‌త విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాల‌ని కోరుతున్నారు. అన్నీ అనుకుని వెళ్ళాక.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.


Tags:    

Similar News