ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు ఎలాంటి వస్తువులు దిగుమతి అవుతాయి?
భారత్ పలు దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మన దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి మన దేశానికి వివిధ రకాల..
భారత్ పలు దేశాలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మన దేశం నుంచి ఇతర దేశాలకు, ఇతర దేశాల నుంచి మన దేశానికి వివిధ రకాల వస్తువులు దిగుమతులు, ఎగుమతులు అవుతుంటాయి. ఇక ఇజ్రాయెల్ , హమాస్ మధ్య పెద్ద వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరు వల్ల ఇజ్రాయెల్‌లో వందలాది మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా వారంలోని మొదటి మార్కెట్ బాగా దిగువకు ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌తో భారత్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నప్పటికీ, భారత్ ఇజ్రాయెల్ నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటోంది.
భారత్ ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకునేవి:
ఇజ్రాయెల్ నుంచి బారత్ సైనిక పరికరాలను అత్యధికంగా కొనుగోలు చేస్తోంది. ఎక్కువగా కొనుగోలు చేసే దేశం భారత్. రష్యా తర్వాత భారతదేశానికి అత్యధిక సైనిక పరికరాలను సరఫరా చేసే దేశం ఇజ్రాయెల్ అనే చెప్పాలి. 1999 నుంచి 2009 వరకు రెండు దేశాల మధ్య సైనిక వాణిజ్యం సుమారు US$9 బిలియన్లు.
విలువైన రాళ్లు, లోహాల కొనుగోలు:
ఇటీవలి సంవత్సరాలలో ద్వైపాక్షిక వాణిజ్యం ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఐటీ, టెలికమ్యూనికేషన్స్, స్వదేశీ భద్రత వంటి అనేక రంగాలలోకి విస్తరించింది. భారత్ ఆసియాలో ఇజ్రాయెల్ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఏడవ అతిపెద్దది.
భారతదేశం వివిధ దేశాల నుంచి అనేక రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ దిగుమతి చేసుకున్న ప్రధాన ఉత్పత్తులలో రసాయన, ఖనిజ ఉత్పత్తులు, విలువైన లోహాలు, రాళ్ళు, మూల లోహాలు, యంత్రాలు, విద్యుత్ పరికరాలు ఉన్నాయి. ఇతర దేశాలలో భారతదేశంలో విస్తృతంగా జనాదరణ పొందిన కొన్ని ఇజ్రాయెలీ ఉత్పత్తుల జాబితా కింద ఉంది.