విలవిలలాడుతున్న అమెరికా

అమెరికాలో మంచు కారణంగా 60 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు

Update: 2022-12-28 02:06 GMT

అమెరికా మంచు తుపాను దెబ్బకు విలవిలలాడుతుంది. ఇప్పటికే అమెరికాలో మంచు కారణంగా 60 మంది వరకూ మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 30 మందికి పైగా మరణించారు. బఫెలో కౌంటీలోనూ అదే పరిస్థితి. మంచు పూర్తిగా కప్పేసింది. 1880 తర్వాత తొలి సారి ఇలాంటి మంచు తుపానును చూస్తున్నామని చెబుతున్నారు.

మంచు దుప్పటి...
ఇప్పటికే మంచు తుపాను దెబ్బకు విమానాలను ఆ యా ప్రభుత్వాలు రద్దు చేశాయి. దాదాపు 4 వేల విమాన సర్వీసులు రద్దయినట్లు చెబుతున్నారు. ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయి ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరిగితే వరదలు సంభవించే అవకాశం లేకపోలేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇందుకు ముందు జాగ్రత్త చర్యలను ప్రభుత్వం తీసుకోవడం ప్రారంభించింది.


Tags:    

Similar News