తప్పనిసరి అయితేనే ఉక్రెయిన్ లో ఉండండి : భారతీయులకు కేంద్రం హెచ్చరిక

ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా.. అక్కడున్న భారతీయులకు కేంద్రం మరోసారి..

Update: 2022-02-21 03:09 GMT

ఉక్రెయిన్ పై దాడి చేసేందుకు సరిహద్దుల్లో రష్యా బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుందో తెలియ అక్కడి ప్రజలు, భారతీయులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా.. అక్కడున్న భారతీయులకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి అయితేనే ఉక్రెయిన్ లో ఉండాలని, లేదంటే వెంటనే ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్ లో ఉన్న భారత విద్యార్థులతో పాటు, మిగతా భారతీయులు కూడా తమకు అందుబాటులో ఉన్న కమర్షియల్, చార్టర్డ్ విమానాల్లో ఉక్రెయిన్ నుంచి బయటపడాలని పేర్కొంది. విద్యార్థులు తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు భారత ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తుండాలని కేంద్రం సూచించింది. అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయని, ఏ క్షణాన అయినా రష్యా విరుచుకుపడవచ్చని భారత్ అభిప్రాయపడింది.


Tags:    

Similar News