మంగళవారం నాడు పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 01:15:01 (భారత కాలమానం ప్రకారం) భూకంప ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది. మంగళవారం తెల్లవారుజామున 1.15 గంటలకు సంభవించిన భూకంపం 120 కిలోమీటర్ల లోతులో వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. ఈ భూకంపంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
శనివారం, 4.1-తీవ్రతతో కూడిన భూకంపం దక్షిణ కొరియాలోని మధ్య ప్రాంతాన్ని కదిలించింది. ఈ ఏడాది దేశంలో సంభవించిన 61 భూకంపాలలో గోసన్ పట్టణంలో సంభవించిన చిన్న భూకంపమే ఇప్పటికీ బలమైనదని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది. విరిగిన పైకప్పులు, కిటికీలు మరియు పగిలిన గోడలతో సహా కనీసం 11 గృహాలు దెబ్బతిన్నాయి. ఇంటీరియర్ అండ్ సేఫ్టీ మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం సాయంత్రం వచ్చిన భూకంపానికి ఎవరూ గాయపడలేదు.