భారీ భూకంపం

ఈ భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోనే అదే ప్రాంతంలో 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇవి రెండు భూకంపాలు..;

Update: 2023-05-25 05:56 GMT
panama - colombia earthquake

panama - colombia earthquake

  • whatsapp icon

పనామా - కొలంబియా సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం పనామా, కొలంబియా దేశాల్లో కనిపించింది. సరిహద్దులోని గల్ఫ్ ఆఫ్ డేరియన్ వద్ద గతరాత్రి భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఇరు దేశాల్లోనూ భూ ప్రకంపనలు కనిపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

ఈ భూకంపం సంభవించిన కొద్ది క్షణాల్లోనే అదే ప్రాంతంలో 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇవి రెండు భూకంపాలు భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు యూఎస్ జీఎస్ తెలిపింది. కాగా.. వీటి కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. కాగా.. భూప్రకంపనల కారణంగా ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పనామా సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సినాప్రోక్ వెల్లడించింది.


Tags:    

Similar News