విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు దుర్మణం.. మరో తొమ్మిది మంది మృతి
మలావీలో విమానం కూలిన ఘటనలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు పది మంది మరణించారు
మలావీలో విమానం కూలిన ఘటనలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు పది మంది మరణించారు. ఆఫ్రికా దేశమైన మాలావిలో విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. అయితే అది పర్వత ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు ధృవీకరించారు. ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమాతో పాటు పది మంది మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తెలిపారు. విమాన శకలాలను గుర్తించామని చెప్పారు. విమానంలో మలావీ ఉపాధ్యక్షుడితో పాటు మరో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు.
ప్రతికూల వాతావరణం...
ఎవరూ ఇందులో ప్రాణాలతో బయటపడలేదని చెప్పారు. ఈ నెల 10వ తేదీన రాజధాని లిలొంగ్వే నుంచి జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని ఏటీసీ సూచించింది. దీంతో అది పర్వత శ్రేణుల ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. తప్పి పోయిన విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.