Afghanistan : ఆప్ఘనిస్థాన్ లో వరద బీభత్సం.. ఇప్పటికే 70 మందికి పైగా మృతి
ఆప్ఘనిస్థాన్ లో వరద బీభత్సానికి అనేక మంది మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు చెబుతున్నారు
ఆప్ఘనిస్థాన్ లో వరద బీభత్సానికి అనేక మంది మృత్యువాత పడ్డారు. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు చెబుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆప్ఘనిస్థాన్ లోని ఘోర్ ప్రావిన్స్ లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకూ 68 మంది వరకూ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇంకా అనేక మంది వరదనీటిలో గల్లంతయ్యాయని, వారి ఆచూకీ లభించడం లేదని చెబుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
చిన్నారులు సయితం...
వరదల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. భవనాలు కుప్పకూలిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. పంట పొలాల నష్టం తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇళ్లు కూలిపోవడంతో చిన్నారులు కూడా బురదలో చిక్కుకుపోయారు. వళ్లంతా బురదతో ముగ్గురు చిన్నారులను తల్లి నీటితో శుభ్రం చేస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిన్నారులు ముగ్గురు ప్రాణాలతో బయటపడినా ఒళ్లంతా బురద అంటుకుని ఉండటం చూపరులను కలచివేస్తుంది.
నిరాశ్రయులైన వారిని...
ఆప్ఘనిస్థాన్ నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అనేక మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. మరికొందరు తమ ఆస్తులు కోల్పోవడంతో సర్వస్వం కోల్పోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడంతో చాలా మంది ఆకలితో అలమటించిపోతున్నారని వార్తా పత్రికల నుంచి వెలువడుతున్న కథనాల మేరకు తెలుస్తోంది. జంతువులు కూడా భారీ సంఖ్యలో మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 2,500 కుటుంబాలు దెబ్బతిన్నాయని, చాలా మందికి ఇళ్లులేకుండా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.