ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారు : మారన్
తమిళ దేశీయ వాదం అధ్యక్షుడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని చెప్పారు.
తమిళ దేశీయ వాదం అధ్యక్షుడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని మారన్ తెలిపారు. ప్రభాకరన్ ఇప్పటికీ తన కుటుంబ సభ్యులతో కాంటాక్ట్‌లో ఉన్నాడని మారన్ తెలిపారు. ఆయన మీడియాతో ఈ విషయాలు చెప్పుకొచ్చారు.
అవన్నీ అవాస్తవం...
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోయింది అవాస్తవమని మారన్ తెలిపారు. తాను బతికే ఉన్నట్లు ప్రపంచానికి చెప్పమని అన్నారని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చానని మారన్ తెలిపారు. త్వరలో ప్రజల ముందకు వస్తారని ఆయన తెలిపారు. 2009 మే 18న ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ చనిపోయాడని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వేలుపిళ్లై ప్రభాకరన్ బతికి ఉన్నారని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.