వణికించిన భూకంపం.. సునామీ వచ్చే అవకాశం ఉందా?

ఈ మధ్య కాలంలో భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రాత్రుల్లో వచ్చే భూకంపాల కారణంగా నిద్రలో ఉన్న జనాలు ఒక్కసారిగా..

Update: 2023-10-09 05:35 GMT

earthquake, magnitude, richter scale, Manipur

ఈ మధ్య కాలంలో భూకంపాలు భయాందోళన కలిగిస్తున్నాయి. రాత్రుల్లో వచ్చే భూకంపాల కారణంగా నిద్రలో ఉన్న జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీస్తున్నారు. ఇక అమెరికాలో భూకంపం భయాందోళన కలిగించింది. వాషింగ్టన్ - పశ్చిమ వాషింగ్టన్‌లో ఆదివారం సాయంత్రం 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా అందరు బయటకు వచ్చారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్ సీస్మిక్ నెట్‌వర్క్ ప్రకారం.. రాత్రి 7:21 గంటలకు మారోస్టోన్ ద్వీపం కింద భూకంప కేంద్రంగా గుర్తించారు. అయితే ఈ భూకంపం 57 కిలోమీటర్ల లోతులో వచ్చి ఉంటుందని అక్కడి భూకం కేంద్ర అధికారులు తెలిపారు. భూకంపం సీటెల్‌కు వాయువ్యంగా ఉన్న పుగెట్ సౌండ్ రీజియన్‌లో.. పోర్ట్ టౌన్‌సెండ్‌కు దక్షిణంగా వాషింగ్టన్‌లోని మారోస్టోన్‌కు దక్షిణంగా 2.5 మైళ్ల దూరంలో ఉన్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయా..?

వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో సునామీ వచ్చే అవకాశం లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రిపోర్టింగ్‌ సమయంలో భూకంప ప్రభావం పూర్తి స్థాయిని పూర్తిగా అంచనా వేయనప్పటికీ.. తదుపరి సునామీ గురించి ఎటువంటి అంచనా లేదని అధికారులు చెప్పడం ద్వారా భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతం తీరప్రాంతం ఎక్కువగా ఉండటంతో సునామీ ఉంటుందనే అంచనాలు తప్పు అని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.



Tags:    

Similar News