మెక్సికోలో భారీ భూకంపం.. స్విమ్మింగ్ పూల్స్ లో మినీ సునామీ, బొమ్మల్లా ఊగిన భవనాలు

మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు ఏమీ జారీకాలేదు కానీ.. భారీ ఎత్తున అలలు..

Update: 2022-09-20 06:21 GMT

మెక్సికోలోని పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రతకు భవనాలు, కార్లు బొమ్మల్లా ఊగాయి. బిల్డింగుల లోపలున్న వస్తువులు చెల్లాచెదురయ్యాయి. స్విమ్మింగ్ పూల్స్ లో మినీ సునామీ వచ్చినట్లైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. స్థానిక కాలమానం సోమవారం మధ్యాహ్నం 10.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కాగా.. ఈ భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ.. ఉన్నట్లుండి భవనాలు ఊగటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు ఏమీ జారీకాలేదు కానీ.. భారీ ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ భూకంపం అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో కొలిమా, మిచోకాన్ రాష్ట్రాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్యూర్టో వల్లర్టాలోని మా హోటల్ గది తీవ్రంగా కదిలింది అని ఓ వినియోగదారుడు ట్విట్టర్ రాశారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు.







Tags:    

Similar News