నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్ ప్రమాణం

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Update: 2024-08-08 04:20 GMT

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేను మంది మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత సైనిక పాలనలోకి వచ్చేసింది. అయితే రాజకీయ పార్టీలతో చర్చించి అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.

షేక్ హసీనా మాత్రం...
ఇందుకోసం మహ్మద్ యూనస్ పేరు ఖరారయింది. ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి కావడంతో పాటు బంగ్లాదేశ్ లో పారిశ్రామికవేత్త కూడా కావడంతో ఆయన పేరును ఖరారు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఆమె యూకే వెళ్లాలని అనుకున్నా అక్కడి నుంచి అనుమతి లభించకపోవడంతో భారత్ లోనే ఉన్నారు.


Tags:    

Similar News