వణికిస్తున్న మంకీపాక్స్.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
ప్రపంచలో వైరస్ లో విరుచుకుపుడుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వైద్యరంగానికి కూడా సవాల్ విసరుతున్నాయి
ప్రపంచలో వైరస్ లో విరుచుకుపుడుతున్నాయి. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వైద్యరంగానికి కూడా సవాల్ విసరుతున్నాయి. ఇప్పుడు మంకీపాక్స్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకూ 27 దేశాలకు మంకీ పాక్స్ విస్తరించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. ఈ 27 దేశాల్లో మొత్తం 780 మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
భారత్ లోనూ....
మే రెండో వారంలో నమోదయిన మంకీ పాక్స్ కేసులు జూన్ మొదటి వారానికి ప్రపంచంలోని 27 దేశాలకు విస్తరించాయి. దీంతో మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తుందన్న అభిప్రాయం వైద్యనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో కూడా మంకీపాక్స్ సోకిన ఒక చిన్నారిని గుర్తించారు. శరీరం పై దుద్దర్లు, దురద ఉండటం మంకీ పాక్స్ కు గుర్తు. దీంతో మహారాష్ట్రలో ఇటువంటి లక్షణాలు కలిగిన చిన్నారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏడు దేశాల్లో మంకీ పాక్స్ కారణంగా 68 మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మొత్తం మీద ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికిస్తుంది.