న్యూయార్క్ లో ఎమెర్జెన్సీ : ఇళ్లలో నుంచి రావద్దని హెచ్చరిక
అమెరికా రాజధాని న్యూయార్క్ వరదల్లో చిక్కుకుంది. దీంతో గవర్నర్ ఎమెర్జెన్సీని ప్రకటించారు
అమెరికా రాజధాని న్యూయార్క్ వరదల్లో చిక్కుకుంది. దీంతో గవర్నర్ ఎమెర్జెన్సీని ప్రకటించారు. ఆకస్మిక వరదలతో న్యూయార్క్ నగరం పూర్తిగా మునిగిపోయింది. న్యూయార్క్ లో 5.1 వర్షపాతం నమోదు కావడంతో న్యూయార్క్ నగరమంతా నీళ్లు నిండిపోయాయి. వాహనాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి.
ట్రాఫిక్ సమస్యతో...
ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్థంభించి పోయింది. న్యూయార్క్ నగరంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గేంత వరకూ అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని కూడా సూచించారు. న్యూయార్క్ నగరం వరదల తాకిడికి గురి కావడంతో ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించారు.