చర్చిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు.. 50 మందికి పైగా మృతి
ఆదివారం నాడు నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన ముష్కరులు కాథలిక్ చర్చిలోకి చొరబడి
ఆదివారం నాడు నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో పేలుడు పదార్థాలతో కూడిన ముష్కరులు కాథలిక్ చర్చిలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది ఆరాధకులు మరణించారని.. మరికొందరు గాయపడ్డారని ప్రభుత్వం, పోలీసులు తెలిపారు. ఒండో స్టేట్‌లోని ఓవో పట్టణంలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాథలిక్ చర్చి వద్ద చోటు చేసుకున్న హింస నైజీరియా నైరుతి ప్రాంతంలో ఒక అరుదైన దాడిగా చెబుతున్నారు. ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఆదివారం ప్రార్థనల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రాగా.. అక్కడికి వచ్చిన ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని ఆ దేశ మీడియా చెబుతోంది.