భయపెడుతున్న ఒమిక్రాన్... లక్ష దాటిన కేసులు
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడి నెలరోజుల్లోనే కేసుల సంఖ్య పెరిగిపోతుంది
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగిపోతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ బయటపడి నెలరోజుల్లోనే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,25,099 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా వందల సంఖ్యలో సంభవించాయి. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
ఎక్కువగా యూకేలోనే....
ఎక్కువగా యూకేలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. యూకేలో ఇప్పటికే ఆంక్షలను కఠినతరం చేశారు. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న వారికి క్షుణ్ణంగా పరీక్షలు జరిపిన అనంతరమే వారిని వదిలేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలన్న నిబంధనలను కూడా అనేక దేశాలు విధించాయి.