ఊపేస్తున్న ఒమిక్రాన్ ... వణుకుతున్న దేశాలు

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు దాదాపు 62 వేలు దాటాయి.

Update: 2021-12-20 03:50 GMT

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు దాదాపు 62 వేలు దాటాయి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టిన సౌతాఫ్రికాలో మాత్రం తక్కువ కేసులు నమోదవుతుండటం విశేషం. ఆ దేశంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కారణంగానే ఇది సాధ్యమయిందంటున్నారు. సౌతాఫ్రికాలో ఇప్పటి వరకూ 1,247 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

యూకేలోనే ఎక్కువగా....
అదే యూకేలో మాత్రం రోజుకు పదివేలు కేసులు నమోదవుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 37,101 కు చేరుకున్నాయి. దీంతో యూకేలోని పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించారు. టెస్ట్ ల సంఖ్యను పెంచారు. లక్షణాలు కూడా పెద్దగా కనపడకపోవడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంది. భారత్ లో ఇప్పటి వరకూ 152 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఒమిక్రాన్ సోకి మరణించిన వారి సంఖ్య తక్కువగా ఉండటం ఊరటకల్గించే అంశం.


Tags:    

Similar News