బ్యాడ్ న్యూస్.. వ్యాక్సిన్ పనిచేయదట

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది. అతి వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే 77 దేశాలకు ఒమిక్రాన్విస్తరించింది.

Update: 2021-12-16 01:40 GMT

ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది. అతి వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే 77 దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన చెందుతోంది. ఆంక్షలు మరింత తీవ్రతరం చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. అందుకే వ్యాక్సిన్ ద్వారానే ఒమిక్రాన్ ను ఎదుర్కొనాలని అన్ని దేశాలు నిర్ణయించాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పేసింది.

టీకాలు వేసుకున్నంత మాత్రాన...
కోవిడ్ టీకాలు ఒమిక్రాన్ వేరియంట్ ను అడ్డుకోలేవని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకే అవకాశముందని తెలిపింది. ఇప్పటి వరకూ బూస్టర్ డోస్ లపై చర్చించిన దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనతో కొంత ఆలోచనలో పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ఇతర మార్గాలను వెతకాలని భావిస్తున్నాయి.


Tags:    

Similar News