24 గంటల్లో 10సార్లు కోవిడ్ వ్యాక్సిన్.. సిబ్బంది తప్పు కాదు

ఒక వ్యక్తి మాత్రం 24 గంటల్లో 10 సార్లు కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో వెలుగుచూసింది.

Update: 2021-12-14 07:27 GMT

కోవిడ్ -19 వ్యాక్సిన్లు వచ్చి సుమారుగా ఏడాది కావస్తోంది. ప్రపంచమంతా శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది కానీ.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. వ్యాక్సిన్ వేయించుకుంటే లేనిపోని రోగాలొస్తాయని, ఏదో జరుగుతుందని అపోహలో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం 24 గంటల్లో 10 సార్లు కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ ఘటన న్యూజిలాండ్ లో వెలుగుచూసింది. అయితే ఇది మెడికల్ సిబ్బంది తప్పిదం కాదు. ఆ వ్యక్తే కావాలని వేర్వేరు గుర్తింపు కార్డులతో పలుచోట్ల వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ విషయం కాస్తా ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లడంతో అది నిజమేనా ? కాదా ? అని నిర్థారించడానికి రంగంలోకి దిగారు అధికారులు. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో.. అది నిజమేనని తేలిందట. సదరు వ్యక్తి వేర్వేరు గుర్తింపు కార్డులతో వ్యాక్సిన్లు తీసుకున్నాడని సాక్షాత్తు ఆరోగ్యశాఖ అధికారులే నిర్ధారించారు.

వేర్వేరు గుర్తింపు కార్డులతో....
న్యూజిలాండ్ లో అక్టోబర్ నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతోంది. జీరో కొవిడ్‌ స్ట్రేటజీ అమలుచేస్తున్న క్రమంలో వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తుల గుర్తింపు కార్డులపై పెద్దగా దృషి పెట్టలేదు. ఇదే అలుసుగా చేసుకున్న ఆ వ్యక్తి అత్యుత్సాహంతో ఏకంగా 24 గంటల్లో 10 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొంది. నిర్విరామంగా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రాణానికి ఎలాంటి అపాయం ఉండదు కానీ.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తోంది. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.


Tags:    

Similar News