Omar Bin Laden: బిన్ లాడెన్ కొడుకు ఎలాంటి పని చేశాడో తెలుసా? దేశం విడిచిపెట్టమన్నారు!

అక్కడ కొన్నేళ్లు బతికాడు ఒమర్ బిన్ లాడెన్

Update: 2024-10-08 11:01 GMT

 Omar 

అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌ చిక్కుల్లో పడ్డాడు. అతడు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల కారణంగా దేశం విడిచి వెళ్లాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అంతర్గత మంత్రి కూడా ధృవీకరించారు.

సౌదీ అరేబియాలో జన్మించగా.. అక్కడ కొన్నేళ్లు బతికాడు ఒమర్ బిన్ లాడెన్. ఆ తర్వాత సూడాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో కూడా నివసించాడు. ఇక 19 సంవత్సరాల వయస్సు నుండి తన తండ్రికి దూరంగా ఉంటూ వచ్చాడు. చివరికి ఉత్తర ఫ్రాన్స్‌లోని నార్మాండీలో ఉంటున్నాడు. పెయింటింగ్‌లో తన టాలెంట్ ను చూపిస్తూ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు.

అయితే ఒమర్ బిన్ లాడెన్ సోషల్ మీడియాలో చేస్తున్న పనుల కారణంగా విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఫ్రాన్స్ అధికారులు కూడా అతడి తీరును తప్పుబడుతూ ఉన్నారు. అతడు తీవ్రవాదానికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అందుకే అతడిని ఫ్రాన్స్ వదిలి వెళ్లిపోవాలని అధికారులు కోరారు. "2023లో తన సోషల్ నెట్‌వర్క్‌లలో ఉగ్రవాదాన్ని సమర్థించే వ్యాఖ్యలను పోస్ట్ చేసాడు" అని ఫ్రాన్స్ అంతర్గత మంత్రి వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధతను న్యాయస్థానాలు కూడా సమర్థించాయని తెలిపారు. ఒమర్ బిన్ లాడెన్ ఇక ఏ కారణంగా కూడా ఫ్రాన్స్‌కు తిరిగి రాకుండా నిరోధిస్తూ నిషేధంపై సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ఒమర్ బిన్ లాడెన్ ఇప్పటికే ఫ్రాన్స్‌ను విడిచిపెట్టాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.
Tags:    

Similar News