28న ఆకాశంలో అద్భుతం.. తప్పకుండా చూడండి
ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే..
రేపు (మార్చి 28) ఆకాశంలో అరుదైన, అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుతాన్ని చూడటం మిస్ అవకండి. వీలైతే.. మంచి పవర్ ఫుల్ బైనాక్యులర్ ను కూడా రెడీగా ఉంచుకోండి. ఈ రోజున ఐదు గ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. గురుడు, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు దగ్గరగా రాబోతున్నాయి. 28న సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఈ అద్భుతం జరగనుంది.
దానిని చూడాలంటే.. పశ్చిమం వైపుకి చూడాల్సి ఉంటుంది. ‘‘50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురుడు, శుక్రుడు, అంగారకుడిని మన కళ్లతోనే చూడొచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ద్వారానే చూడగలరు’’ అని నాసాకు చెందిన బిల్ కూక్ సూచించారు. 2022 జూన్ లో కూడా ఇలాంటి అద్భుతం ఆకాశంలో కనిపించింది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని ఒకే లేఖనంపైకి వచ్చారు. కాగా.. రేపు జరగబోయే ఈ దృశ్యాన్ని ఖచ్చితంగా చూడాలని అమెరికా మాజీ ఖళోగ శాస్త్రవేత్త, చంద్రుడిపై నడిచిన తొలి వ్యొమగామి అయిన డాక్టర్ బజ్ ఆల్డ్రిన్ కూడా సూచించారు. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని తెలిపారు.