PM Modi: రష్యాలో మోడీకి ఘన స్వాగతం.. మాస్కోలో టవర్‌పై భారత త్రీవర్ణ పతాకం

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్

Update: 2024-07-08 16:27 GMT

PM Modi Russia

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో చేరుకున్నారు. మాస్కో విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఈ పర్యటన అనేక విధాలుగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. మాస్కోలో అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు. 2022 ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత ప్రధాని రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. జూలై 9న రష్యా పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ ఆస్ట్రియాకు బయల్దేరి వెళ్లనున్నారు, ఇది 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా పర్యటించడం విశేషం.

ఇదిలా ఉండగా, మాస్కోలోని ఓస్టాంకినో టవర్‌ను భారత త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత మోడీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. జూన్ 9న క్రెమ్లిన్‌లోని తెలియని సైనికుడి సమాధి వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచనున్నారు. ఆ తర్వాత, మాస్కోలోని ఎగ్జిబిషన్ వేదిక వద్ద ఉన్న రోసాటమ్ పెవిలియన్‌ను సందర్శిస్తారు. అంతకుముందు మోదీ పర్యటన సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై చర్చలు జరపనున్నారు.


మాస్కో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి డప్పువాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇంధనం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య గత 10 ఏళ్లలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా వృద్ధి చెందిందని రష్యాకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News