ఖతార్‌లో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష రద్దు

ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది మాజీ భారతీయ నావికులకు గురువారం (డిసెంబర్ 28) పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై

Update: 2023-12-28 10:35 GMT

Indian Ex Navy officer

ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది మాజీ భారతీయ నావికులకు గురువారం (డిసెంబర్ 28) పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై మొత్తం ఎనిమిది మంది మరణశిక్షను రద్దు చేస్తూ జైలు శిక్షగా మార్చింది కోర్టు. అక్టోబరులో ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులకు విధించిన మరణశిక్షను ఖతార్ కోర్టు గురువారం తగ్గించింది. అధికారులు జైలు శిక్ష అనుభవిస్తారని ఖతార్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయమై ఖతార్‌లోని కోర్టును ఆశ్రయించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు శిక్షను తగ్గించింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ, "సవివరమైన ఆర్డర్ కాపీ కోసం వేచి ఉంది" అని తెలిపింది. తదుపరి చర్యలకు సంబంధించి ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో మా న్యాయ బృందం సంప్రదింపులు జరుపుతోంది. విచారణ సందర్భంగా రాయబారులు, అధికారులు కోర్టుకు హాజరయ్యారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.


మొదటి నుండి ఎనిమిది మంది కుటుంబానికి అండగా నిలుస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాని గురించి ఎక్కువగా మాట్లాడటం సరికాదని, మేము ఖతార్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని నిరంతరం లేవనెత్తామని తెలిపింది.

Tags:    

Similar News