రిషి సునాక్ ఏమన్నారంటే?

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆయనను అధికారికంగా ప్రధానిగా ప్రకటించారు

Update: 2022-10-25 11:54 GMT

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ కొద్దిసేపటి క్రితం నియమితులయ్యారు. బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆయనను అధికారికంగా ప్రధానిగా ప్రకటించారు. బాధ్యతలను అప్పగించినట్లు బకింగ్ హ్యామ్ ప్యాలెస్ ఆయనకు అప్పగించినట్లు పేర్కొంది. అతి చిన్న వయసులో ప్రధాని బాధ్యతలను చేపట్టిన రిషి సునాక్ ప్రసంగించారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన తెలిపారు. బ్రిటన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో...
ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తానని ఆయన ప్రజలకు మాట ఇచ్చారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని మార్కెట్లపై ప్రభావం చూపుతుందన్నారు. మాజీ ప్రధాని లిజ్ ట్రస్ ను రిషి సునాక్ ప్రశంసించారు. ప్రతి స్థాయిలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తానని ఆయన దేశ ప్రజలకు మాట ఇచ్చారు. ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయనున్నామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News