ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ఎయిర్ ఇండియా సర్వీసులు

ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాలను బట్టి ఫిబ్రవరి 25,27 తేదీలతో పాటు మార్చి 6న కైవ్ నుంచి ఢిల్లీకి

Update: 2022-02-23 06:44 GMT

ఉక్రెయిన్ : ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్కడ చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇప్పటికే కొందరిని స్వదేశానికి తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి ఏ క్షణంలోనైనా యుద్ధం జరగవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అక్కడ చిక్కుకుపోయిన సుమారు 20 వేలమంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా సంస్థ చొరవ తీసుకుంది.

ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాలను బట్టి ఫిబ్రవరి 25,27 తేదీలతో పాటు మార్చి 6న కైవ్ నుంచి ఢిల్లీకి నాలుగు విమానాలను నడపనున్నారు. ఇవే కాకుండా బోరిస్పిల్ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 22,24,26 తేదీల్లో భారత్ కు విమాన సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరి 22న ఒక విమానం ఉక్రెయిన్ కు చేరుకోగా.. అక్కడ ఉన్న భారతీయులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి నిన్న ఒక విమానం ఢిల్లీకి రాగా.. ఆ విమానం ద్వారా 241 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులకు ఏదైనా సమస్య తలెత్తితే.. వెంటనే సంప్రదించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసింది భారత్. 1800118797 టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్ లైన్ నంబర్లు +380 997300428, +380 997300483 24 గంటలు అందుబాటులో ఉంటాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 



Tags:    

Similar News