Russia and Ukraine War : విరుచుకుపడిన ఉక్రెయిన్.. 14 మంది మృతి

రష్యా - ఉక్రెయిన్ వార్ కొన్ని నెలలుగా జరుగుతుంది. కానీ ఒక దేశంపై మరొక దేశం ఆధిపత్యాన్ని సాధించలేకపోతున్నాయి;

Update: 2023-12-31 02:08 GMT
russia, ukraine, war, fourteen died, russia-ukraine war, ukraine news, world news

 russia-ukraine war

  • whatsapp icon

రష్యా - ఉక్రెయిన్ వార్ కొన్ని నెలలుగా జరుగుతుంది. కానీ ఒక దేశంపై మరొక దేశం ఆధిపత్యాన్ని సాధించలేకపోతున్నాయి. చిన్న దేశమైన ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలన్న రష్యా కల ఇంత వరకూ నెరవేరలేదు. రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతగా తిప్పి కొడుతుంది. ఉక్రెయిన్ లో అనేక నగరాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో మరణించారు. వేల సంఖ్యలో జనం ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోయారు. ఆస్తి నష్టం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెగించి పోరాడుతూ...
అయినా సరే ఉక్రెయిన్ బలగాలు తెగించి పోరాడుతున్నాయి. తమ పట్టణాలు, నగరాలను రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నప్పటికీ తిరిగి వాటిని కైవసం చేసుకుంటున్నాయి. దెబ్బకు దెబ్బ తీయడంలో ఉక్రెయిన్ బలగాలు పోరాడుతూనే ఉన్నాయి. రష్యా ఎప్పటికప్పుడు దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉక్రెయిన్ దళాలు ఎదురుదాడితో తిప్పి కొడుతున్నాయి. అందుకే ఉక్రెయిన్ ను తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా సేనలు ఇప్పటికీ చెమటోడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
తాజా దాడుల్లో...
తాజాగా ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో రష‌యాకు చెందిన పథ్నాలు మంది మరణించారు. వందకు పైగా ప్రజలు గాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉణ్న బెల్లొరోడ్ లో ఉక్రెయిన్ సైన్యం విరుచుకుపడింది. ఈ మేరకు రష్యా కూడా అధికారికంగా ప్రకటించింది. ఉక్రెయిన్ చేసిన బాంబుల దాడిలో పథ్నాలుగు మంది రష్యన్ లు ప్రాణాలు కోల్పోయారని అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నాని ప్రకటించింది. రష్యా కూడా ప్రతి దాడులకు దిగుతోంది. అయితే పరిస్థితి గుంభనంగా ఉందని తెలిసింది.



Tags:    

Similar News