అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకం రేగింది. టెక్సాస్ నగరంలో దుండగులు కాల్పులు జరిపారు;

Update: 2023-05-07 05:24 GMT
shooting, texas, amercia
  • whatsapp icon

అమెరికాలో కాల్పుల కలకం రేగింది. టెక్సాస్ నగరంలో దుండగులు కాల్పులు జరిపారు. ఒక మాల్‌లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు పోలీసులతో సహా తొమ్మిది మంది మరణించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు.

9 మంది మృతి...
కాల్పులకు గల కారణం మాత్రం తెలియరాలేదు. దుండగుడు కూడా మరణించడంతో కారణం మాత్రం బయటకు వచ్చే అవకాశాలు లేవు. మృతులు ఎవరన్నది ఇంకా తేలలేదు. పోలీసులు మాల్‌ను చుట్టుముట్టి మరికొందరు దుండగులు ఉన్నారా? అన్న అనుమానంపై గాలింపు చర్యలు చేపట్టారు. ఇంత పెద్ద సంఖ్యలో మరణించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసి కొందరు ప్రాణాలను దక్కించుకున్నారు.


Tags:    

Similar News