అగ్రదేశాన్ని వణికిస్తోన్న మంచు తుఫాను.. వేలసంఖ్యలో విమానాలు రద్దు

మంచుతుఫాను మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో..

Update: 2022-01-30 05:56 GMT

అగ్రదేశం.. అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. విరామం లేకుండా కురుస్తోన్న మంచు బీభత్సం సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్పియా నగరాల్లో అడుగుమేర మంచు పేరుకుపోయింది. రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోగా.. ప్రజలకు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు.

మంచుతుఫాను మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా వాతావరణ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో.. ఆఫీసులు, పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నాలుగు వేలకు పైగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ప్రజలెవ్వరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్ హాటన్‌కు సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు.





Tags:    

Similar News