ఒక్కరోజులో పది లక్షల కేసులు.. వణుకుతున్న అమెరికా

అమెరికాలో కరోనా వ్యాప్తి ఆందోళన కల్గిస్తుంది. రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి

Update: 2022-01-04 14:34 GMT

అమెరికాలో కరోనా వ్యాప్తి ఆందోళన కల్గిస్తుంది. రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఒమిక్రాన్ అగ్రరాజ్యమైన అమెరికాను వణికిస్తుంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా కన్పిస్తున్నా కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం లక్షల్లో ఉంది. ప్రతి వంద మందిలో ఒకరికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు ఈ సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

వరస సెలవులు....
సోమవారం ఒక్కరోజే అమెరికాలో పది లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవల దాదాపు ఆరు లక్షల కేసులు నమోదవ్వడంతోనే ఆందోళన చెందారు. అలాంటిది పది లక్షల కేసులు నమోదవ్వడంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమయింది. వ్యాక్సినేషన్ పూర్తి స్థాయిలో జరిగినా కరోనా కేసులు పెరుగుతుండటం ఇబ్బందిగా మారింది. వరసగా సెలవులు రావడం కరోనా కేసులు పెరగడానికి కారణమంటున్నారు. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం, రికవరీ రేటు ఎక్కువగా ఉండటం ఊరట కల్గించే అంశం.


Tags:    

Similar News